Home  upakarma_yajusha_telugu.pdf (Click this file, if you have any font issues)

ఉపాకర్మ

క్రియ

  • ఆచార్యః శిష్యైస్సహ నద్యాం స్నాత్వా। దర్భేష్వాసీనః దర్భాన్ధారయమాణః।।

శిష్యులతో కలిసి నదిలో స్నానము చేసి, దర్భాసనము పై కూర్చుని దర్బను చేతితో పట్టుకోవాలి.

        ఆచమ్య - - - ప్రీత్యర్థం శ్రావణ్యాం పౌర్ణమాస్యాం అధీతానాం అధ్యేష్యమాణానాం ఛన్దసాంచ సవీర్యత్వాయ, అయాతయామత్వాయ చ,  శిష్యైస్సహ-  అధ్యాయోపాకర్మ కరిష్యే।। (ఆచర్య వచనమ్)

ఆచమనము చేసి, దేశకాలములతో పాటు సంకల్పము ఆచార్యుడు చెప్పాలి.

   గణపతి పూజాం, పుణ్యాహం వాచయిత్వా

గణపతి పూజ, పుణ్యాహవాచనమ్

  • స్వలంకృతే పీఠే, ప్రణవ వ్యాహృతి త్రయ సహితైః తత్తన్నామ మన్త్రైః, ప్రజాపత్యాది నవఋషీ నావాహయేత్।। (నివీతీ భూత్వా)

అలంకరించిన పీఠముపై, 9 కూర్చలను ఉత్తర సమాప్తిగా పెట్టి,  9 మంది ఋషులను ఆవాహన చెయ్యాలి. ఆవాహన చేసే ముందు యజ్ఞోపవీతమును నివీతిగా (మాలలా) ధరించాలి

  • ప్రజాపతిం కాణ్డఋషిమ్- ఆవాహయామి
  • సోమం కాణ్డఋషిమ్- ఆవాహయామి
  • అగ్నిం కాణ్డఋషిమ్- ఆవాహయామి
  • విశ్వాన్దేవాన్ కాణ్డర్‌షీన్ వాహయామి
  • సాంహితీర్దేవతా ఉపనిషదః- ఆవాహయామి
  • వారుణీర్దేవతా ఉపనిషదః- ఆవాహయామి
  • యాజ్ఞికీర్దేవతా ఉపనిషదః- ఆవాహయామి
  • బ్రహ్మాణం స్వయంభువమ్ ఆవాహయామి
  • సదసస్పతిమ్- ఆవాహయామి (ఉపవీతీ)

ప్రతీ కూర్చపై అక్షతలు పూలను వేసి ఆవాహన చేయవలెను.

ఆవాహన చేసిన తరువాత యజ్ఞోపవీతమును సవ్యముగా ధరించవలెను.

ఆవాహిత నవఋషిదేవతాభ్యో నమః। యథాశక్తి ధ్యాన- ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే।।

ఆవాహన చేసిన నవఋషులకు 16 ఉపచారములతో పూజ చెయ్యాలి.

నవర్షి తర్పణమ్

నవఋషి తర్పణం చేయవలెను

పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్, అస్యాం శుభతిథౌ------ ప్రీత్యర్థం ప్రాజాపత్యాది నవఋషి తర్పణం కరిష్యే।।

నివీతీ భూత్వా।।

సంకల్పము చేసిన తురువాత యజ్ఞోపవీతమును నివీతిగా మార్చుకోవలెను (మాలలా)

  • ప్రజాపతిం కాణ్డఋషిమ్- తర్పయామి। తర్పయామి।।
  • సోమం కాణ్డఋషిమ్- తర్పయామి। తర్పయామి।।
  • అగ్నిం కాణ్డఋషిమ్- తర్పయామి। తర్పయామి।।
  • విశ్వాన్దేవాన్ కాణ్డఋషీగ్ స్తర్పయామి। తర్పయామి।।
  • సాహితీర్దేవతా ఉపనిషదః। తర్పయామి। తర్పయామి।।
  • వారుణీర్దేవతా ఉపనిషదః। తర్పయామి। తర్పయామి।।
  • యాజ్ఞికీర్దేవతా ఉపనిషదః। తర్పయామి। తర్పయామి।।
  • బ్రహ్మాణగ్గ్ స్వయంభువం। తర్పయామి। తర్పయామి।।
  • సదసస్పతిం। తర్పయామి। తర్పయామి।। (ఉపవీతీ)

ఆచార్యః ప్రాజాపత్యాదీ నవఋషీన్ జుహుయాత్

ఆచార్యుడు, నవర్షి దేవతలకు హోమం చేయవలెను

యజ్ఞోపవీత పూజ, దాన ధారణమ్

 ఆచమ్య ----- ప్రీత్యర్థమ్, అధ్యాయోపాకర్మాంగత్వేన శ్రౌత స్మార్త, నిత్య కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం,

నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే।।

తదంగత్వేన యజ్ఞోపవీత పూజాం కరిష్యే।।

ధరించేముందు యజ్ఞోపవీతమును పూజించాలి.

  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। ధ్యాయామి। ధ్యానం సమర్పయామి।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। ఆవాహయామి।। ఆసనం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। పాదారవిన్దయో పాద్యం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। హస్తయోః అర్ఘ్యం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి।। 
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। శుద్ధోదక స్నానం సమర్పయామి। స్నానానంతరం ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। వస్త్రయుగ్మం సమర్పయామి। వస్త్ర ధారణానన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। యజ్ఞోపవీతం సమర్పయామి।। యజ్ఞోపవీత ధారణానన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। దివ్య శ్రీ చన్దనం సమర్పయామి।।
  • యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। అక్షతాన్ సమర్పయామి।।

అథ నామపూజాం సమర్పయామి।।

  • ప్రజాపతయే నమః। పరమేష్ఠినే నమః।
  • బ్రహ్మణే నమః। ధాత్రే నమః।
  • విధాత్రే నమః। శబ్దహేతవే నమః।
  • మనోరూపాయ నమః। సర్వ విద్యా స్వరూపాయ నమః।  

ధూపః

వనస్పత్యుద్భవై ర్దివ్యై ర్నానా గన్ధై స్సుసంయుతః।

ఆఘ్రేయ స్సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్।।

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః ధూపమాఘ్రాపయామి।।

దీపః -

సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియమ్।

గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహా।

భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే।

త్రాహి మాం నరకాద్ ఘోరా ద్దివ్యజ్యోతి ర్నమోస్తుతే।।

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః దీపం దర్శయామి।

ధూప దీపానన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి।।

నైవేద్యం -

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః అమృతోపహార నైవేద్యం నివేదయామి।

నైవేద్యం షడ్రసోపేతం ఫల లడ్డుక సంయుతమ్।

నివేదనం సురశ్రేష్ఠ ప్రీత్యై తత్ ప్రతిగృహ్యతామ్।।

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। నైవేద్యం నివేదయామి। మధ్యే మధ్యే పానీయం సమర్పయామి। హస్తౌ ప్రక్షాళయామి। పాదౌ ప్రక్షాళయామి। ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి।।

తాంబూలమ్

పూగీ ఫలై స్సకర్పూరైర్ నాగవల్లీ దళైర్యుతమ్।

ముక్తాచూర్ణ సమాయుక్తం తామ్బూలం ప్రతిగృహ్యతామ్।।

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। తామ్బూలం సమర్పయామి।।

నీరాజనమ్

ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలై స్తథా।

నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ।।

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। నీరాజనం సన్దర్శయామి।। నీరాజనాన్తరం శుద్ధాచమనీయం సమర్పయామి। రక్షాం గృహ్ణామి।।

మన్త్రపుష్పమ్

యజ్ఞోపవీత దేవతాభ్యోనమః। సువర్ణ దివ్య మన్త్రపుష్పం సమర్పయామి।।

ప్రదక్షిణమ్

యాని కాని చ పాపాని జన్మాన్తర కృతాని చ।

తాని తాని ప్రణశ్యన్తి ప్రదక్షిణ పదే పదే।।

పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః।

త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల।।

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ।

తస్మా త్కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర।।

శ్రీ యజ్ఞోపవీత దేవతాభ్యోనమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।।

అనేన పూజనేన భవాగన్ సర్వాత్మః శ్రీ పరమేశ్వరః సుప్రీణాతు

 ఆచమ్య ----- ప్రీత్యర్థం అధ్యాయోపాకర్మాంగత్వేన నూతన యజ్ఞోపవీత ధారణ సాద్గుణ్యార్థం, యజ్ఞోపవీత దానం కరిష్యే।।
అస్మై బ్రాహ్మణాయ శ్రీ మహావిష్ణు స్వరూపాయ
సదక్షిణాకం యజ్ఞోపవీతం తుభ్యమహం సంప్రదదే న మమ।।

యజ్ఞోపవీతమును ఆచార్యునికి ఇవ్వవలెను

ఆచమ్య ----- ప్రీత్యర్థం అధ్యాయోపాకర్మాంగత్వేన, శ్రౌత స్మార్త, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం, నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే।।
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్ యత్సహజం పురస్తాత్। ఆయుష్య మగ్ర్యం ప్రతిముఞ్చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః।।

సంకల్పము చేసిన తరువాత ఆచమనం చేసి సంప్రదాయాను సారముగా యజ్ఞోవీతమును ధరించవలెను

యజ్ఞోపవీత ధారణ సాద్గుణ్యార్థం
యథాశక్తి గాయత్రీ జపం కరిష్యే।।
యజ్ఞోపవీత విసర్జనమ్ –

ఉపవీతం ఛిన్నతన్తుం జీర్ణం కశ్మలదూషితమ్।

విసృజామి యశాబ్రహ్మా వర్చోదీర్ఘాయురస్తుమ్।।

యజ్ఞోపవీత ధారణ చేసిన తరువాత గాయత్రీ జపం చేసి, ఆ తరువాత పాత యజ్ఞోపవీతమును విసర్జన చేయవలెను.

కామోకార్షీన్నమో నమః। మన్యుః కార్షీన్నమో నమః।।

(ఇతి జపిత్వా, బ్రహ్మయజ్ఞేన యజేత।।

ఈ 2 మంత్రములను 108 లేదా 1008 సార్లు యథాశక్తి జపం చేయవలెను.

అనేన అధ్యాయోపాకర్మణా శ్రీపరమేశ్వరసమర్పణమస్తు।

Home