Veda Vijnaana Vishtaram

Dr. Vamshi Krishna Ghanapaathi's Literary Works

वंशीकृष्ण घनपाठिनः - सारस्वतोपासनम्

vkg

नवदुर्गा पञ्चकम् - भावार्थश्च

Home

मन्दाक्रान्ता वृत्तम्

ओं ऐं ह्रीं श्रीं वर मनु तनुं मातरं राधयेऽहम्

आदि क्षान्त  प्रमिति सदयां मातृकान्तां श्रयेऽहम्

सर्वारिष्ट प्रशमनकरीं  मातरं पूजयेऽहम्।

दुर्गां देवीं नवविध गुणां सच्चिदानंद रूपाम्।। 1


  1. मेना पुत्रीं शिव निजपतिं शैलपुत्रीं भजेऽहम्

  2. दीक्षाऽऽधारां व्रत विधि परां ब्रह्मचारिण्युमां ताम्

  3. लक्ष्मीरूपां  विनत सुखदां चंद्रघंटां भजेऽहम्

  4. कूष्मांडां तां कलुष हरणां चोदयित्रीं महेशीम्।। 2


  5. वात्सल्येता  ऽऽदर परिगता स्कंदमाता प्रणम्या।

  6. सौम्यां नेत्र त्रय सुभरणां नौमि कात्यायनीं ताम्।

  7. काळी नित्या  परिहृत तमाः कालरा.त्रीडिता सा।

  8. ज्ञानानंदा  गुरुवर निभा सा महा गौरिका मे।।    3


  9. दात्री सिद्धिं पर मभयदा सिद्धिदात्री भवानी।

वाचं वाचं प्रणत शिरसा  नाम दुर्गांबिकायाः।

मोचं मोचं द्वयगत भियं धन्यजीवो भवानि।

ब्रह्मानंदं  निरुपमघनं तद्दयाया भजामि।।     4


मंदं मंदं मम.कृति.मतां कर्तृता पाशभेत्त्री

मंदाक्रान्ता  ऽसिद सुलवन क्लेश जातापनोदाम्

मन्दे पुंसि  प्रणत सुजने  पूर्णकारुण्य दृष्टिम्

मन्दस्मित्या  ऽनिश समवनीं मातरं भावयेऽहम्।। 5
 

  1. ఓం ఐం హ్రీం శ్రీం వర మను తనుం మాతరం రాధయేऽహమ్।

ఓంకార ఐంకార హ్రీంకారశ్రీంకారములనే శ్రేష్ఠమైన మంత్రములను తన రూపముగా కలిగినటువంటి అమ్మవారిని పూజిస్తున్నాను.

  1. ఆదిక్షాన్త ప్రమితి సదయాం మాతృకాం తాం శ్రయేऽహమ్।

వాస్తవానికి 'అ'కారము మొదలుకుని 'క్ష'కారము వరకు ఉన్న వర్ణముల తత్త్వ జ్ఞానమును అనుగ్రహించే (తద్ద్వారా ప్రపంచ సారమును అందించే ) మాతృకాదేవతను ఆశ్రయిస్తున్నాను.

  1. సర్వారిష్ట ప్రశమనకరీం మాతరం పూజయేऽహమ్।

ఈ జ్ఞానము వలన మా అరిష్టములన్నీ కూడా తొలగించే అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. (అనగా బీజాక్షర జపము, వాటితో చేసేపూజల వలన దోషాలు తొలగిపోతాయి.)

  1. దుర్గాం దేవీం నవవిధ గుణాం సచ్చిదానంద రూపామ్।।

ఇలా మనలను అనుగ్రహించే సచ్చిదానంద రూపిణి అయినదుర్గా అమ్మవారు 9 ఆకారాలతోనవదుర్గలు అనే పేరిట విరాజిల్లుతున్నది. (ఇకపైన ఆ నవదుర్గలనుస్మరించుకుందాం.)

  1. మేనా పుత్రీం శివనిజపతిం శైలపుత్రీం భజేऽహమ్।

శైలపుత్రి అనగా హిమవంతుని కుమారై. ఈమె తల్లి మేనాదేవీ. ఇలాగిరిజా రూపములో అవతరించి, శివుడిని భర్తగా పొందిన శైలపుత్రీ దేవినినమస్కరిస్తున్నాను.

  1. దీక్షాऽऽధారాం వ్రతవిధి పరాం బ్రహ్మచారిణ్యుమాం తామ్।

శివుడిని పొందాలంటేఅకుంఠితమైన దీక్ష కావాలి. అందుకు మౌనము నిరాహరత్వము మొదలైన వ్రతములు అవసరము. అటువంటికఠినవ్రతమును ఆచరించిన బ్రహ్మచారిణి (ఉమాదేవిని) భజిస్తున్నాను.

  1. లక్ష్మీరూపాం వినత సుఖదాం చంద్రఘంటాం భజేऽహమ్।

తనకు మొక్కిన వారికి దారిద్రభావములేకుండా చేసి సుఖమును కలిగించే చంద్రఘంటా దేవి లక్ష్మీ స్వరూపము. ఆవిడను సేవిస్తున్నాను.

  1. కూష్మాండాం తాం కలుషహరణాం చోదయిత్రీం మహేశీమ్।

మన పాపాలను పోగొట్టే అమ్మవారి రూపానికికూష్మాండాఅని పేరు. (కూష్మాండ మంత్రములు మహాపాతకములనుసహితంపోగొడతాయనివేదము చెప్తుంది.) మహేశ్వరుడి పట్టపురాణిఅయిన ఆ దుర్గాంబిక, మనబుద్ధులను సన్మార్గమునందు ప్రేరేపించి రక్షించుగాక.

  1. వాత్సల్యేతా ऽऽదరపరిగతా స్కందమాతా ప్రణమ్యా।

తల్లి యొక్క ప్రధానమైన గుణములువాత్సల్యము, ఆదరణ. ఇటువంటి ప్రేమాదర మూర్తిని స్కందమాత అన్నారు. కుమారస్వామికి తల్లి అయిన దుర్గాదేవికి మాతృ సుఖము కావాలి అనుకునేవారునమస్కరించాలి.

  1. సౌమ్యాం నేత్ర త్రయ సుభరణాం నౌమి కాత్యాయనీం తామ్।

పువ్వులాంటి కోమలమైన ముఖము కలది కాత్యాయనీ దేవి.ఈవిడకి 3 నేత్రములున్నాయి. సౌమ్య స్వభావము కావాలనుకునే నేను కాత్యాయనికి నమస్కరిస్తున్నాను.(ఈమె కాత్య మహర్షికి కుమార్తెగా అవతరించిందని పురాణ ప్రసిద్ధి).

  1. కాళీ నిత్యా పరిహృత తమాః కాలరాత్రీడితా సా।

తమో గుణముకు సంకేతమైన నల్లని రంగులో భాసిల్లే దేవిని కాళీ అన్నారు.మనలోని అజ్ఞానమనే చీకటిని పోగొట్టే ఈ కాళరాత్రీ దేవికే నిత్య అని మరో పేరు.నాలోని తామసికప్రవృత్తిని ఉపసంహరించేందుకై, ఈ కాళరాత్రీదేవి నా చేత స్తుతించబడినది.

  1. జ్ఞానానందా గురువర నిభా సా మహా గౌరికా మే।

తామసిక ప్రవృత్తి పోయిన తరువాత మిగిలే, శుద్ధ జ్ఞానము వలన కలిగే ఆనందమునే తన రూపముగా కలిగినది మహాగౌరి. మనకుజ్ఞానమునందించేసమయంలో అమ్మవారు గురురూపముగా విరాజిల్లుతూ, ఆనందమయస్థితికి చేరుస్తుంది.

  1. దాత్రీ సిద్ధిం పర మభయదా సిద్ధిదాత్రీ భవానీ।

ఆ జ్ఞానానందము వలన మనకు పరమార్థము సిద్ధిస్తుంది. ద్వైతభావము లేదు కాబట్టి భయము కూడా ఉండదు.ఇలా మోక్షమును ఇచ్చే భవానీదేవి సిద్ధిదాత్రి అనే 9వ పేరుతో ప్రసిద్ధమైనది.

  1. వాచం వాచం ప్రణత శిరసా నామ దుర్గాంబికాయాః।

  2. మోచం మోచం ద్వయగత భియం ధన్యజీవో భవాని।

  3. బ్రహ్మానందం నిరుపమ.ఘనం తద్దయాయా భజామి।।

ఆ దుర్గాంబిక యొక్క నామములను భక్తితో శిరస్సు వంచి పలుకుతూ, పలుకుతూ

ఇతరుల వల్ల వస్తుందని భావించే భయమును వదిలిపెడుతూ, నేను ధన్యజీవిని కావాలి

ఇలా భయము పోగా మిగిలేది నిరుపమానమైన బ్రహ్మానందమే.ఆ ఆనందాన్నిఅమ్మవారి దయవల్ల పొందుతున్నాను.

  • మందం మందం మమ.కృతి.మతాం  కర్తృతా పాశభేత్త్రీ।।

మందాక్రాన్తా ऽసిద సులవన క్లేశ జాతాపనోదామ్।

మన్దే పుంసి ప్రణత సుజనే పూర్ణకారుణ్య దృష్టిమ్।

మన్దస్మిత్యా ऽనిశ సమవనీం మాతరం భావయేऽహమ్।।

వాస్తముగా అమ్మవారు భక్తులను అనుగ్రహించే విధానము చాలా గొప్పగా ఉంటుంది. తాను ఏదైన పని చేస్తున్నాను అనుకునే వాడికివాటిపై అధికారము,ఫలాపేక్ష ఉంటాయి. ఇదే మమకారము. తద్ద్వారా సుఖ దుఃఖాలు ఉంటాయి. కాబట్టి సుఖదుఃఖాలకు మూలము తాను చేస్తున్నాను అనే అహంకారమే.

తనను ఆశ్రయించిన ప్రతివ్యక్తిలోని మమకారమనేమోహపాశమును, నెమ్మదినెమ్మదిగా తొలగిస్తుంది. అసిదము అంటే కత్తి. (వైద్యుడు నొప్పి తెలియకుండా చికిత్స చేసినట్లుగా) జ్ఞానమనే కత్తితో నెమ్మదిగా ఛేదించి, మనయొక్క క్లేశములన్నింటిని పోగొడుతుంది.

మందకొడి వారైనా పర్వాలేదు. మంచితనమును గలిగిన భక్తుల యందు అమ్మవారు, పూర్ణమైన కరుణాదృష్టిని కలిగి ఉంటుంది. కేవలం, తన మందహాసము చేతనేమనకు కావలసిన రక్షణ ఇచ్చే, ఆ జగదంబను మనసారా భావన చేస్తున్నాను.

మన్మథ నామ సంవత్సర దేవీ నవరాత్రి

సరస్వతీపూజ 18- 10- 2015

All Rights Vested in Paramaatman ....